samsung galaxy on 6: శామ్ సంగ్ గెలాక్సీ ఆన్6 విడుదల... ధర రూ.14,490

  • 5.6 అంగుళాల డిస్ ప్లే
  • 4జీబీ ర్యామ్, 64 స్టోరేజీ 
  • వెనుక 13 మెగాపిక్సల్, ముందు 8 మెగా పిక్సల్ కెమెరాలు

శామ్ సంగ్ కంపెనీ ఇన్ఫినిటీ డిస్ ప్లే తో కూడిన గెలాక్సీ ఆన్ 6 మోడల్ ను ఆవిష్కరించింది. ఇది కేవలం ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో, శామ్ సంగ్ ఆన్ లైన్ షాప్ లోనే లభిస్తుంది. విక్రయాలు ఈ నెల 5న మొదలు కానున్నాయి. ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి కేవలం రూ.49కే పూర్తి మొబైల్ రక్షణ కవరేజీని ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

అలాగే, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. ప్రతీ నెలా రూ.1,610 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫోన్లో 5.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 18.5:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సదుపాయాలు ఉన్నాయి. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి.

More Telugu News