Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో అపశ్రుతి... చాగల్లు వాసి మృతి!

  • భారీ వర్షాలు, మంచుతో ఆగిన యాత్ర
  • గుండెపోటుతో మరణించిన తోట రత్నం
  • సమాచారాన్ని బంధువులకు పంపిన అధికారులు

భారీ వర్షాలు, మంచు కారణంగా అమర్ నాథ్ యాత్రకు ఇబ్బందులు కలుగుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు నుంచి యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. నాలుగు రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లిన తోట రత్నం మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, చాగల్లులో విషాదకర వాతావరణం నెలకొంది.

బలకేజ్ బేస్ ప్రాంతంలో గత మూడు రోజులుగా చిక్కుకుపోయిన తెలుగు బృందంలో తోట రత్నం ఉన్నారని, చలికి తట్టుకోలేక ఆమెకు గుండెపోటు వచ్చిందని అధికారుల నుంచి సమాచారం అందింది. వాతావరణం అనుకూలించగానే ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నట్టు రత్నం బంధువులు తెలిపారు.

మరోవైపు బల్తాల్ తదితర బేస్ క్యాంపుల్లో 300 మంది ఉండాల్సిన చోట 5 వేల నుంచి 6 వేల మంది తిండి లేక అలమటిస్తున్న పరిస్థితి. వీరికి ఆహారాన్ని హెలికాప్టర్లలోనే పంపాల్సివుండటం, వాతావరణం అనుకూలించక పోవడంతో ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక, అక్కడే బిక్కుబిక్కుమంటూ వీరంతా గడుపుతున్నారు.

More Telugu News