Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' నుంచి కొత్త పోస్టర్!

  • చేతి నిండా సినిమాలతో బిజీగా విజయ్ దేవరకొండ
  • 'గీత గోవిందం' ప్రమోషన్ తో మరింత బిజీ
  • ఆగస్టు 15న విడుదలకు సిద్ధం

'ఐయామ్ స్టిల్ వర్జిన్'  అంటున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' వంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలీవుడ్ స్టార్ ప్రస్తుతం కన్నడ భామ రష్మిక మందనతో కలిసి 'గీత గోవిందం' ప్రమోషన్‌ లో ఉన్నాడు. ఇప్పటికే ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి సరదా సంభాషణలు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.

ఇక ఈ ఉదయం 8.30 గంటల సమయంలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. "మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌" అంటూ విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్టర్‌ ను ఉంచాడు. పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో "ఐ యామ్‌ 25. స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌" అని రాసుండగా, రష్మిక వైపు ఓరగా  చూస్తున్నాడు విజయ్. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.

More Telugu News