Drugs: డ్రగ్స్‌తో పట్టుబడితే ఇక మరణశిక్షే.. చట్ట సవరణకు కేంద్రాన్ని కోరుతున్న పంజాబ్!

  • పంజాబ్‌లో డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణాలు
  • కదిలిన రాష్ట్ర ప్రభుత్వం
  • డ్రగ్స్‌తో ఒకసారి పట్టుబడినా మరణశిక్షే
  • మాదక ద్రవ్యాల చట్టాన్ని సవరించాలంటూ కేంద్రానికి ప్రతిపాదన

మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, వ్యాపారులపై కఠిన చర్యల దిశగా పంజాబ్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. డ్రగ్ స్మగ్లర్లు, వ్యాపారులకు మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో  జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ఫలితంగా ఇటువంటి ప్రతిపాదన చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ రికార్డులకెక్కనుంది.

మాదక ద్రవ్యాలను పదేపదే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే మరణశిక్ష విధించాలని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం చెబుతోంది. అయితే, పంజాబ్ ప్రభుత్వం మాత్రం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారితోపాటు వాటిని విక్రయించే వారికి కూడా మరణ శిక్ష విధించాలని కోరుతోంది.  

More Telugu News