Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డాక్టర్ పాత్రలో నయనతార 
  • నాగ్, నాని మల్టీ  స్టారర్ అప్ డేట్స్ 
  • వచ్చేనెల నుంచి బన్నీ కొత్త సినిమా 
  • భారీ బడ్జెట్టుతో వెంకీ, చైతూల చిత్రం  

 *  అజిత్ హీరోగా రూపొందుతున్న 'విశ్వాసం' ద్విభాషా చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో ఆమె డాక్టర్ గా కనిపించనుందని తాజా సమాచారం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాదులో జరిగింది.
*  నాగార్జున, నాని హీరోలుగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ చిత్రం హైదరాబాదులో కొనసాగుతోంది. ఇప్పటికి 65 శాతం షూటింగును పూర్తిచేసుకుంది. ఈ నెలాఖరుకి మొత్తం పూర్తవుతుంది. ఇందులో నాగ్  గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా.. నాని డాక్టర్ గా నటిస్తున్నాడు.
*  అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని విక్రంకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.  
*  వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. భారీ బడ్జెట్టుతో నిర్మించే ఈ చిత్రానికి 'వెంకీ మామ' టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

More Telugu News