vro: తెలంగాణ వీఆర్‌వో, ఏఎస్‌ఓ, సీసీఎల్‌ఏ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఈ నెల 8 వరకు పెంపు!

  • ఈరోజే దరఖాస్తులకు చివరిరోజు కావడంతో సాంతికేక సమస్యలు
  • గడువు పెంచుతూ అధికారుల నిర్ణయం 
  • ఉద్యోగాల నోటిఫికేషన్‌కు విశేష స్పందన

తెలంగాణలో 2,786 పోస్టుల భర్తీ కోసం ఇటీవల టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏఎస్‌ఓ, వీఆర్వో, సీసీఎల్‌ఏ, హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాల దరఖాస్తుల గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు ఈరోజు చివరి రోజు కావడంతో చాలా మంది ఆ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యారు.

దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. ఈరోజు సెకనుకు ఏకంగా 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

More Telugu News