Uttar Pradesh: కాన్పూర్ బ్లూ వరల్డ్‌ వాటర్‌ పార్క్‌ వద్ద.. ఓ కుటుంబంపై బౌన్సర్ల దాడి .. వీడియో వైరల్‌

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పార్క్‌
  • వాహనాన్ని నడిపే విషయంపై వాగ్వివాదం
  • ఒకరిని కింద పడేసి కొట్టిన వైనం

ఉత్తరప్రదేశ్‌, కాన్పూర్‌లోని బ్లూ వరల్డ్‌ వాటర్‌ పార్క్‌ వద్ద ఓ కుటుంబంపై బౌన్సర్లు దాడి చేశారు. ఆ పార్క్‌ ఆవరణలో తమ వాహనాన్ని నడిపే విషయంపై బాధిత కుటుంబం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలోని ఒకరిని బౌన్సర్లు కింద పడేసి మరీ కొడుతుండడం అక్కడి ఓ కెమెరాకు చిక్కింది.

ఈ ఘటనతో ఆ పార్క్‌ వద్ద కాసేపు అలజడి చెలరేగింది. పార్క్‌కు వచ్చిన వారంతా గూమిగూడి కనపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు బౌన్సర్లతో గట్టిగా మాట్లాడుతూ తమను కొట్టడంపై ప్రశ్నిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.      

More Telugu News