kcr: కేసీఆర్ అవినీతి బయటపడేదాకా వదిలిపెట్టం: నాగం

  • ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకోవడం లేదు
  • కేసీఆర్ దోపిడీపైనే కేసులు వేశాం
  • అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరును మారుస్తాం

తెలంగాణలోని ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఖండించారు. తాము ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని... కేసీఆర్ చేస్తున్న దోపిడీపైనే కేసులు వేశామని చెప్పారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టేంత వరకు వదిలిపెట్టబోమని అన్నారు. ఈ దోపిడీలో కేసీఆర్ కు అండగా ఉన్న అధికారులను సైతం జైలుకు పంపిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరును మారుస్తామని... అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగా నామకరణం చేస్తామని నాగం తెలిపారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పనులను అర్హత లేని మెగా సంస్థకు ఇచ్చారని... ఈ పనుల్లో రూ. 1500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 5,800 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని... దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. 

More Telugu News