cpi: మహా కూటమిలో సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్: సీపీఐ

  • పవన్ కు రాజకీయాలపై స్పష్టత ఉంది
  • ఇమేజ్, క్రేజ్ ఉన్న పవన్ సీఎం అయితే బాగుంటుంది
  • కన్నా చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి

రానున్న ఎన్నికల నేపథ్యంలో మహా కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణే అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజకీయాలపై పవన్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. పవన్ కు ఇమేజ్, క్రేజ్ రెండూ ఉన్నాయని... అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 85 శాతం నిధులు ఇచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ఏ పార్టీ అయినా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని పొత్తులు పెట్టుకుంటే... వారికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తనకు రెండేళ్ల సమయం ఇస్తే... కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానంటూ గాలి జనార్దనరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని... వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ నెల 4న విజయవాడలో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. 

More Telugu News