Madhya Pradesh: ఆవుల సంరక్షణకు నడుం బిగించిన ముస్లిం మహిళ... తన ప్రాణాలు కాపాడాలని ప్రధానికి మొర!

  • భోపాల్ సమీపంలో మెహరున్నీసా గోశాల
  • నిన్న దాడి చేసిన కొందరు
  • మీడియాకు విషయం వెల్లడించిన మెహరున్నీసా

మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో గో సంరక్షణాలయం నిర్వహిస్తున్న ఓ ముస్లిం మహిళ, ఇప్పుడు తన ప్రాణాలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీకి మొరపెట్టుకుంది. భోపాల్ లో మెహరున్నీసా ఖాన్ అనే మహిళ, గోశాలను నిర్వహిస్తుండగా, కొందరు నిన్న ఆమెపై దాడి చేశారు. దాడి విషయాన్ని మీడియాకు వెల్లడించిన మెహరున్నీసా, తన కన్న తల్లిదండ్రులు, కుమార్తె కూడా బెదిరిస్తున్నారని వాపోయింది.

రాష్ట్రీయ గో సేవాసమితి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్న ఆమె, నీమచ్ సమీపంలో గోశాలను నిర్వహిస్తోంది. తనను కిడ్నాప్ చేసి హత్య చేయాలని చూస్తున్నారని, తనపై యాసిడ్ దాడి జరగవచ్చని, తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంది. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా గతంలో మెహరున్నీసా మాట్లాడగా, ఆ సమయంలోనూ ఆమె బెదిరింపులను ఎదుర్కొంది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ఇది కుటుంబ సమస్య మాత్రమేనని, మత పరమైన విషయంగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె కుటుంబీకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 

More Telugu News