KCR: కే.. అంటే కాలువలు.. సీ.. అంటే చెరువులు.. ఆర్.. అంటే రిజర్వాయర్లు.. సీఎం పేరుకు సరికొత్త నిర్వచనం!

  • కేసీ‌ఆర్‌కు హరీష్ రావు సరికొత్త నిర్వచనం
  • తెలంగాణ పథకాలపై కేంద్రం ప్రశంసలు
  • బీజేపీ నేతలు ఉనికి కోసమే విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేరుకు నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సరికొత్త నిర్వచనం చెప్పారు. సిద్ధిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. కేంద్ర మంత్రులు, అధికారులు.. అందరూ తెలంగాణలోని ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మొత్తం దేశానికే ఆదర్శమన్నారు. రైతుల సంక్షేమం కోసం కాలువలు, చెరువులు, రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి సారించిన కేసీఆర్ అనే పేరుకు అర్థం మారిపోయిందన్నారు. కె.. అంటే కాలువలు, సీ..ఆంటే చెరువులు, ఆర్.. అంటే రిజర్వాయర్లు అంటూ సరికొత్త నిర్వచనం చెప్పారు. .

కేసీఆర్‌ను ని‌త్యం వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీజేపీ నేతలపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ఉనికి కోసం అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని హరీష్ రావు జోస్యం చెప్పారు.

More Telugu News