పెద్దపులితో సెల్ఫీ దిగిన నటుడు నవదీప్... వైరల్ అవుతున్న ఫొటో!

01-07-2018 Sun 06:19
  • ఇటీవలే ట్రాఫిక్ పై సెటైర్ వేసిన నవదీప్
  • తాజాగా పెద్దపులితో సెల్ఫీ
  • 'ఏరా పులీ' అంటూ క్యాప్షన్
"ఏరా పులీ..." అంటూ సూపర్ హిట్ చిత్రం "యమదొంగ"లోని డైలాగ్ ను గుర్తుకు తెస్తున్నాడు తెలుగు నటుడు నవదీప్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే నవదీప్, తాజాగా ట్రాఫిక్ పై ఓ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఫొటోను పోస్టు చేసి సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఓ అడవిలోకి వెళ్లిన నవదీప్, అక్కడ ఉన్న పెద్దపులితో సెల్ఫీ దిగాడు. దీనికి "ఏరా పులీ..." అన్న డైలాగ్‌ ని జోడించి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఫొటోను ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నానన్న విషయాన్ని మాత్రం నవదీప్ వెల్లడించలేదు.

#erapuli?

A post shared by Nav Deep (@pnavdeep) on