bride: పిడుగుపాటుకు భయపడ్డ వరుడు.. అతడిని పెళ్లి చేసుకోనన్న వధువు!

  • బీహార్‌లోని సర్నా జిల్లాలో ఘటన 
  • విచిత్రంగా ప్రవర్తించిన పెళ్లికొడుకు
  • ఇరు వర్గాల మధ్య గొడవ

కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది ఓ పెళ్లి కూతురు.. పిడుగు పడ్డందుకు వరుడు భయపడిపోవడమే అందుకు కారణమైంది. ఆ తరువాత కూడా ఆ వరుడు విచిత్రంగా ప్రవర్తించాడని వధువు చెప్పింది. ఇంతగా భయపడిపోయే వాడిని పెళ్లి చేసుకోబోనని అందరి ముందూ చెప్పేసింది. బీహార్‌లోని సర్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అతడిని వధువు తిరస్కరించినందుకు పెళ్లి కొడుకు బంధువులు వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మరింత గొడవ చెలరేగడంతో వధువు తరఫు బంధువులు రెచ్చిపోయి దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వధువు తరఫు ముగ్గురు బంధువులను అరెస్ట్‌ చేశారు.

More Telugu News