Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వైఎస్ బయోపిక్ 'యాత్ర'లో అనసూయ
  • ప్రేమకథా చిత్రానికి నాని వాయిస్ ఓవర్ 
  • యూరప్ వెళుతున్న రామ్ చరణ్
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన వెంకీ 

 *  మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ 'యాత్ర' పేరిట మహి వి. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం. రాజశేఖర రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు రాజకీయ నాయకురాలి పాత్రను అనసూయ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
*  రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఈ మాయ పేరేమిటో' చిత్రానికి నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతున్నాడు.
*  రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి చెందిన తదుపరి షెడ్యూల్ షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. జూలై మొదటి వారం నుంచి యూరప్ లోని పలు లొకేషన్లలో రెండు పాటలను చిత్రీకరిస్తారు.
*  సీనియర్ హీరో వెంకటేశ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటించడానికి తాజాగా ఓకే చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

More Telugu News