bali international airport: అగ్నిపర్వతం నుంచి గాల్లోకి భారీగా బూడిద... బాలి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత

  • గాల్లోకి 8,200 అడుగుల ఎత్తువరకు వ్యాపించిన బూడిద
  • విమానాల ఇంజన్లకు నష్టం వాటిల్లుతుందని అంచనా
  • దీంతో సర్వీసుల నిలిపివేత

బాలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ రోజు తాత్కాలికంగా మూసివేశారు. 48 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బాలికి సమీపంలోని మౌంట్ అగంగ్ అగ్నిపర్వతం నుంచి ఈ రోజు భారీగా బూడిద వెలువడుతోంది. గాలిలో 8,200 అడుగుల ఎత్తు వరకు బూడిద వ్యాపించింది.

 గతేడాది చివర్లో మౌంట్ అగంగ్ అగ్నిపర్వతం పేలిపోవడంతో డిసెంబర్ లో విమానాశ్రయాన్ని కొన్ని రోజుల పాటు మూసేశారు. అప్పటి నుంచి ఇది నిద్రాణంగానే ఉంది. తాజాగా ఈ అగ్నిపర్వతం చురుగ్గా మారి బూడిదను వెదజల్లుతోంది. ఆ గాలిలోంచి విమానాలు ప్రయాణిస్తే ఇంజన్లకు నష్టం వాటిల్లుతుందన్న అంచనాతో సర్వీసులను రద్దు చేశారు. విమానాశ్రయం నుంచి మౌంట్ అగంగ్  70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

More Telugu News