cuddapah: ప్రశాంతంగా కొనసాగుతున్న కడప జిల్లా బంద్

  • ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి
  • విపక్షాల బంద్ తో స్తంభించిన జనజీవనం
  • కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధింపు

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బంద్ జరుగుతోంది. కడప జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ బంద్ తో జనజీవనం స్తంభించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో పలు విద్యా సంస్థలు ఒకరోజు ముందే స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

More Telugu News