ntr biopic: ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై నాదెండ్ల కుటుంబం అభ్యంతరాలు.. క్రిష్, బాలకృష్ణకు నోటీసులు!

  • ఈ సినిమాలో మా తండ్రి పాత్ర గురించి అనుమతి తీసుకోలేదు
  • నెగిటివ్ గా ఆయన పాత్రను చూపించే ప్రయత్నం జరుగుతోంది
  • నోటీసుల్లో పేర్కొన్న నాదెండ్ల భాస్కరరావు పెద్దకుమారుడు  

‘ఎన్టీఆర్’ బయోపిక్ పై నాదెండ్ల భాస్కరరావు కుటుంబం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణకు భాస్కరరావు పెద్దకుమారుడు నోటీసులు పంపారు. ఎమ్మెల్యే, నటుడి హోదాలో బాలకృష్ణకు రెండు నోటీసులు పంపినట్టు సమాచారం.

 ఈ సినిమాలో తన తండ్రి భాస్కరరావు పాత్ర విషయమై తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని, నెగిటివ్ షేడ్ లో భాస్కరరావును చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, ఆయనపై ‘బయోపిక్’ తీసుకోవడంలో తప్పులేదు కానీ, తన తండ్రిని నెగెటివ్ గా చూపించాలనుకోవడం సరికాదని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ రూపొందుతోంది.

More Telugu News