Telangana: తెలంగాణలోని 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ మంజూరుకు నిర్ణయం

  • 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరుకు నిర్ణయం
  • ప్రభుత్వ సాయం పొందిన ఎన్జీఓలు సేవా దృక్పథంతో పనిచేయాలి
  • తెలంగాణ సీఎస్ ఎస్ కె.జోషి వెల్లడి

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తెలిపారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఫండ్ స్టేట్ లెవల్ కమిటి ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్ జ్యోతి, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సోనిబాలాదేవి, డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, వివిధ జిల్లాలలో అనాధబాలలు, వృద్ధాశ్రమాలు, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు 50 శాతం ఇచ్చే గ్రాంట్ ను 75 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ సహాయం పొందిన ఎన్జీఓలు సేవా దృక్పథంతో పని చేసి రోల్ మోడల్ గా నిలవాలని, ఈ సంస్థలను జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారులు సందర్శించాలని కోరారు.

మేడ్చల్ జిల్లాలో -2, రంగారెడ్డి -5, నల్గొండ-3, నాగర్ కర్నూల్-1, వరంగల్-1, ఆదిలాబాద్-1, మంచిర్యాల్ -1, పెద్దపల్లి-1, మహబూబ్ నగర్ లో ఒక స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 

More Telugu News