ముంబయిలో నివాసాల మధ్య కుప్పకూలిన చార్టెడ్‌ విమానం.. ఐదుగురి మృతి

28-06-2018 Thu 14:12
  • మంబయి ఘట్కోపర్‌లో ఘటన
  • కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ప్రమాదం
  • కొనసాగుతోన్న సహాయక చర్యలు
ముంబయి ఘట్కోపర్‌లో చార్టెడ్‌ విమానం కుప్పకూలింది. మరికాసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా ఆ విమానం నివాసాల మధ్యే కూలి, మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.