assam odissa hindi: దక్షిణాదికి ఉత్తర భారతీయుల వలసలు.. పెరుగుతున్న హిందీ వారి ప్రాబల్యం!

  • దక్షిణాదికి పెరుగుతున్న ఉత్తరాది ప్రజల వలసలు
  • అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న హిందీ మాట్లాడేవారి సంఖ్య 
  • కర్ణాటక, ఏపీలో వీరి జనాభా ఎక్కువ
  • దక్షిణాది రాష్ట్రాలకే మొగ్గు చూపుతున్న తమిళనాడు, కేరళ వాసులు

దక్షిణాది స్వరూపాన్ని ఉత్తరాది ప్రజలు మార్చేలా ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాది నుంచి దక్షిణాదికి పెరుగుతున్న వలసలే కారణం. తమిళం, మలయాళం మాట్లాడే జనాభా ఉత్తరాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గుతుంటే... అదే సమయంలో తమిళనాడు, కేరళ రాష్రాల్లో హిందీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా మాట్లాడే వారి సంఖ్య పెరుగుతోంది.

తాజాగా విడుదలైన 2011 జనాభా మాతృభాషా గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఈ రెండు రాష్ట్రాల నుంచి, ఉత్తరాదికి ఎక్కువగా వలసలు కొనసాగగా, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఉత్తరాదికి వలసపోయిన తమిళనాడు, కేరళ వాసులు ఇప్పుడు దక్షిణాదిలోనే ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటకకు వలసలు ఎక్కువగా ఉన్నాయి.

ఒకప్పుడు దక్షిణాది వారికి గమ్యస్థానంగా ఉన్న మహారాష్ట్ర (ముంబై కారణంగా)లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మాట్లాడేవారు తగ్గారు. ఉత్తరాదిన 2001 నుంచి 2011 వరకు మలయాళీయుల సంఖ్య పెరుగుదల ఉన్నది మాత్రం యూపీలోనే. ఇక్కడ నోయిడా కేంద్రంగా ఐటీ కంపెనీలున్న విషయం తెలిసిందే. ఇక తమిళ ప్రజల పెరుగుదల గురుగ్రామ్ కారణంగా హర్యానాలో కనిపించింది.  అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హిందీ మాట్లాడే వారు ఎక్కువగా కర్ణాటక, ఏపీలలో ఉన్నారు. 

More Telugu News