Tamilnadu: తమిళనాడులో వైద్య విద్యలో ప్రవేశం కావాలంటే... తల్లిదండ్రులతో ఉన్న అనుబంధానికి రుజువు చూపాలి

  • ఎనిమిది రకాల పత్రాలు సమర్పించాలి
  • తల్లిదండ్రుల వివరాలు కూడా తప్పనిసరి
  • ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నిబంధనలు

తమిళనాడు రాష్ట్రంలోని కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందాలకునే విద్యార్థులు కనీసం ఎనిమిది రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్, నేటివిటీ, ఇన్ కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు వంటి వివరాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులతో వారికున్న అనుబంధాన్ని తెలియజేసే పత్రాలను కూడా చూపాలన్న నిబంధన విధించారు.

ఈ మేరకు ఓ నోటీసు ఎస్ఎస్ సీ వెబ్ సైట్లో కనిపిస్తోంది. అయితే, దీనిపై ఎస్ఎస్ సీ సెక్రటరీ డాక్టర్ జి.సెల్వరాజన్ స్పందిస్తూ... విద్యార్థులు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు రాష్ట్రంలో చదవని పరిస్థితుల్లో వారు తమ తల్లిదండ్రులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News