amarnath yatra: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర

  • ఉదయం నుంచి భారీ వర్షాలు
  • బల్తాల్ బేస్ క్యాంప్ వద్ద నిలిపివేత
  • వర్షాలు ఆగి, రోడ్డు మార్గాన్ని క్లియర్ చేసిన తర్వాతే అనుమతి

భారీ వర్షాలు అమర్ నాథ్ యాత్రకు ఆటంకం కలిగించాయి. దీంతో అమర్ నాథ్ యాత్రకు బయల్దేరిన తొలి బృందం బల్తాల్ వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి అక్కడ భారీ వర్షాలు కరుస్తున్నాయి. బల్తాల్ బేస్ క్యాంపు వద్ద యాత్రికులను నిలిపివేసిన అధికారులు, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే తిరిగి ముందుకు అనుమతిస్తామని తెలిపారు. భారత వాతావరణ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు చెప్పారు.

‘‘వాతావరణ పరిస్థితుల వల్లే యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇక్కడి నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల వరకు రోడ్డు జారుడుగా, పల్లంగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. వర్షం ఆగితే తప్ప పరిస్థితి కుదుటపడదు. అందుకోసం వేచి చూస్తున్నాం. వర్షం ఆగిన తర్వాత రహదారి మార్గాన్ని క్లియర్ చేయడానికి నాలుగైదు గంటలు పడుతుంది’’ అని గండెర్బల్ డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింఘ్లా వివరించారు.

More Telugu News