kalyan dev: బావగారి ట్రైలర్ చరణ్ కి బాగా నచ్చేసిందట!

  • రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత'
  • కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ 
  • వచ్చేనెల 12వ తేదీన విడుదల     

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' సినిమా రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ కి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ ట్రైలర్ గురించి చరణ్ స్పందించాడు .. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుందంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఈ సినిమా దర్శక నిర్మాతలకు .. ఇతర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. లుక్స్ పరంగా .. డాన్స్ పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన కల్యాణ్ దేవ్, నటన పరంగా ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. ఇక కల్యాణ్ దేవ్ రెండవ సినిమాకి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రెండవ సినిమా దర్శకుడిగా హరీశ్ శంకర్ పేరు వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.       

More Telugu News