ntr: రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ .. చరణ్ రంగంలోకి దిగేది అప్పుడే!

  • రాజమౌళి నుంచి మల్టీ స్టారర్ 
  • నవంబర్ నుంచి షూటింగుకి ఎన్టీఆర్ 
  • డిసెంబర్లో జాయిన్ కానున్న చరణ్

రాజమౌళి తాజా చిత్రం ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఇటు చరణ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ లో లాంచ్ చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ తరువాత నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా చేస్తున్నాడు. అక్టోబర్లో ఈ సినిమా విడుదలవుతుంది కనుక ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. నవంబర్ నుంచి ఆయన రాజమౌళి సినిమా షూటింగులో పాల్గొంటాడట. ఇక బోయపాటితో చరణ్ చేస్తోన్న సినిమా, సంక్రాంతికి విడుదలకానుంది. నవంబర్లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసి .. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెట్టుకోనున్నారు. అందువలన చరణ్ ఫ్రీ అవుతాడు కనుక డిసెంబర్లో రాజమౌళి సినిమా షూటింగులో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేస్తోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News