lorry: లారీ చక్రం కింద ఇరుక్కుపోయిన యువకుడు.. నరకయాతన!

  • వరంగల్‌ జిల్లా వర్థన్న పేటలో రోడ్డు ప్రమాదం
  • బైకును ఢీ కొన్న లారీ
  • నిస్సహాయ స్థితిలో లారీ కిందే గంటసేపు ఉన్న యువకుడు
  • క్రేన్ల సాయంతో కాపాడిన పోలీసులు

వరంగల్‌ జిల్లా వర్థన్న పేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళుతోన్న ఓ యువకుడిని లారీ ఢీ కొట్టడంతో అతడు ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డాడు. దీంతో ఆ లారీ అతడి పైకి ఎక్కేసింది. లారీ చక్రం కిందే చిక్కుకుపోయిన యువకుడు సుమారు గంటసేపు నరకయాతన అనుభవించాడు. నిస్సహాయ స్థితిలో సాయం కోసం అర్థిస్తూ భరించలేని నొప్పితో ఆ యువకుడు తల్లడిల్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్రేన్‌ల సాయంతో లారీని వెనక్కులాగి యువకుడిని రక్షించారు. అనంతరం అక్కడి నుంచి దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.         

More Telugu News