ICC: ప్రపంచంలో 90 శాతం క్రికెట్ ప్రియులు భారత్ లోనే!

  • టెస్ట్ మ్యాచ్ కు 70 శాతం మంది ఓటు
  • టీ20 మ్యాచులకు 92 శాతం మంది జై
  • వన్డే మ్యాచులకు ఆఫ్రికాలో 91 శాతం మంది ఆదరణ

ఈ ప్రపంచంలో క్రికెట్ ను అభిమానించే వంద కోట్ల మందిలో 90 శాతం మంది ఒక్క భారతదేశంలోనే ఉన్నారని ఐసీసీ నిర్వహించిన మార్కెట్ పరిశోధనలో వెల్లడైంది. క్రికెట్ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, భవిష్యత్తు వృద్ధి కోసం విధాన రూపకల్పన, నిర్ణయాలు తీసుకోవడంలో ఐసీసీకి మార్గదర్శనం చేసేందుకు ఈ పరిశోధన నిర్వహించడం జరిగింది.

 ప్రపంచంలో క్రికెట్ ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని తేలింది.  ఇంగ్లండ్, వేల్స్ లో అయితే అత్యధికంగా 86 శాతం మంది టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల పట్ల ఆఫ్రికాలో 91 శాతం మంది ఇష్టపడుతున్నారు. టీ 20 క్రికెట్ ను అభిమానించే వారు పాకిస్థాన్ లో 98 శాతం మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ 20 మ్యాచులను 92 శాతం మంది లైక్ చేస్తుంటే, వన్డే మ్యాచులను 88 శాతం మంది ఇష్టపడతున్నారు. 16-69 మధ్య వయసు కలిగిన వారి నుంచి అభిప్రాయాలను పరిశోధనలో భాగంగా తెలుసుకున్నారు.

More Telugu News