తమిళ స్టార్ హీరోతో సెట్స్ పైకి వెళ్లిన రకుల్

27-06-2018 Wed 11:46
  • సూర్య సరసన చేస్తోన్న రకుల్ 
  • కార్తీ జోడీగాను మరోసారి 
  • శివకార్తికేయన్ మూవీలో ఛాన్స్
తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ .. ప్రస్తుతం తమిళంలోను స్టార్ హీరోల జోడీగా వరుస సినిమాలను అంగీకరిస్తోంది. ఇప్పటికే ఆమె సూర్య .. కార్తీ సినిమాలకు ఓకే చెప్పేసింది. తాజాగా శివకార్తికేయన్ జోడీగా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్లో రూపొందుతుంది.

 ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజునే మొదలుపెట్టారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ పాత్రకి చాలా ప్రాముఖ్యత వుంటుందట. ఈ సినిమా తరువాత తమిళనాట తన క్రేజ్ మరింత పెరుగుతుందని ఆమె భావిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.