Himalayas: కట్టుదిట్టమైన భద్రత మధ్య మొదలైన అమర్ నాథ్ యాత్ర

  • మంచు రూపంలో కొలువుదీరిన అమరనాథుడు
  • దర్శనానికి బయలుదేరిన తొలి బ్యాచ్
  • నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత పెంపు

హిమాలయ పర్వతాల్లో మంచు రూపంలో కొలువుదీరే పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు జరిపే అమర్ నాథ్ యాత్ర మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భక్తుల తొలి బ్యాచ్ ఈ ఉదయం భగవత్ నగర్ లోని జమ్మూ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభమైంది.

తొలి బ్యాచ్ వాహనాలకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, గవర్నర్ సలహాదారు బీబీ వ్యాస్ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతను మరింగా పెంచారు. యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాస్ తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు ఒకటిన్నర లక్షల మంది యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు.

More Telugu News