Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లాయర్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ 
  • గెస్ట్ పాత్రలో విజయ్ దేవరకొండ!
  • 'అరవింద సమేత'లో శుభలేఖ సుధాకర్ 
  • సూర్య సినిమాలో జగపతిబాబు

*  త్వరలో లాయర్ పాత్రలో నటించనున్నానని చెప్పింది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ కన్నడ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ కొట్టింది. 'దర్శకుడు పవన్ చెప్పిన కథ చాలా బాగుంది. ఇందులో నేను లాయర్ గా నటిస్తాను. ఆగస్టులో ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాను' అని చెప్పింది అనుపమ.
*  'పెళ్లిచూపులు' చిత్రం తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. విశ్వక్ సేన్, అనీషా ఆంబ్రోస్, సుశాంత్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ పాత్ర పోషించాడు. ఈ 29న ఈ చిత్రం విడుదలవుతోంది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రంలో ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. ఇటీవలే ఆయన చిత్రం షూటింగులో జాయిన్ అయ్యాడు కూడా. కాగా, ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.  
*  సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'NGK' చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More Telugu News