cuddapah: రేపు ఏపీ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం: వర్ల రామయ్య

  • కడప ఉక్కు సాధించే వరకు విశ్రమించం
  • మేము దీక్షలు చేస్తుంటే కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు
  • బైక్ ర్యాలీల తర్వాత ఢిల్లీ వేదికగా ఎంపీలతో ధర్నా చేస్తాం

కడప ఉక్కు సాధించే వరకు విశ్రమించేది లేదని, ఏపీలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని, తాము దీక్షలు చేస్తుంటే కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.

 బైక్ ర్యాలీలు నిర్వహించిన తర్వాత ఢిల్లీ వేదికగా ఎంపీలతో ధర్నా చేస్తామని, కేంద్రంలో కదలిక రాకపోతే జరగబోయే పరిణామాలకు, మోదీ, అమిత్ షా లు బాధ్యత వహించాలని హెచ్చరించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తున్న ఆమరణ దీక్షపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చైల్డిష్ గా ఉన్నాయని విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని, జనసేన, వైసీపీకి నైతిక విలువలుంటే సీఎం రమేష్ కి మద్దతివ్వాలని కోరారు.

More Telugu News