vijay devarakonda: ఇక వరసబెట్టనున్న విజయ్ దేవరకొండ సినిమాలు

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'టాక్సీవాలా'
  • ముగింపు దశలో 'నోటా'
  • నెక్స్ట్ ప్రాజెక్టుగా 'గీత గోవిందం'    

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఓ అరడజను సినిమాలు వున్నాయి. ఆయన చేసిన 'టాక్సీవాలా' ఆల్రెడీ షూటింగును పూర్తి చేసుకుని విడుదల సమయం కోసం ఎదురుచూస్తోంది. ఇక 'నోటా' అనే సినిమాను కూడా చేస్తున్నాడాయన. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయవలసి ఉండటంతో, ఈ ప్రాజెక్టుపైనే విజయ్ దేవరకొండ ఎక్కువ దృష్టి పెట్టాడు.

ఈ సినిమాలో ఆయన సరసన మెహ్రీన్ కనిపించనుంది. తెలుగు .. తమిళ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్టుగా 'గీత గోవిందం' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రష్మిక మందన ఆయనతో జోడీ కడుతోంది. ఈ సినిమాలన్నీ కూడా చాలా తక్కువ గ్యాప్ లోనే ఈ ఏడాదిలోనే వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇది విజయ్ దేవరకొండ అభిమానులకి ఆనందాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి.    

More Telugu News