Sanjana Singh: దారితెలియక గూగుల్ మ్యాప్ చూస్తున్న నటి సంజనా సింగ్... సెల్ ఫోన్ లాక్కెళ్లిపోయిన దొంగ!

  • చెన్నై పెరంబూరు సమీపంలో దొంగతనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
  • దొంగ కోసం గాలిస్తున్నామన్న పోలీసులు

మరికొద్ది దూరం సైక్లింగ్ చేయాలన్న ఉద్దేశంతో దూరం వెళ్లి, దారితప్పిపోయి, గూగుల్ మ్యాప్స్ లో వెనక్కు వెళ్లే దారికోసం వెతుకుతున్న దక్షిణాది నటి సంజనా సింగ్ సెల్ ఫోన్ ను ఓ దొంగ లాక్కెళ్లిపోయిన ఘటన పెరంబూరు సమీపంలో జరిగింది. తెలుగులో 'రేణిగుంట' చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామకు, ఉదయాన్నే సైక్లింగ్ చేసే అలవాటు ఉందట.

ఉదయం 6 గంటల సమయంలో ముగపేర్ నుంచి అన్నా నగర్ లోని తన సోదరి ఇంటికి సైకిల్ పై వెళ్లి వస్తున్న వేళ ఎక్కువ దూరం సైక్లింగ్ చేసింది. ఆ సమయంలో ఎటు వెళ్లాలో తెలియక సెల్ ఫోన్ లో చూసుకుంటూ నెమ్మదిగా వస్తుండగా, చింతామణి సిగ్నల్ సమీపంలో దొంగతనం జరిగింది. తాను ఆ దొంగను వెంబడించేందుకు ప్రయత్నించినా, దొరకలేదని ఆమె అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ మేరకు కేసు నమోదైంది. దొంగ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News