nithin: మరోసారి నితిన్ జోడీగా హన్సిక

  • నితిన్ హీరోగా 'భీష్మ' 
  • దర్శకుడిగా వెంకీ కుడుముల
  • త్వరలోనే సెట్స్ పైకి    

తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా హన్సికకి మంచి క్రేజ్ వుంది. కుర్రకారు కలల రాణిగా ఆమె తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తోంది. తమిళంలో అగ్రకథానాయికగా వెలుగొందుతూ వస్తోన్న ఈ సుందరి, తెలుగులో అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఓ నాలుగేళ్లుగా ఆమె సరైన సినిమా చేయలేకపోయింది. విష్ణుతో చేసిన 'లక్కున్నోడు' ..  గోపీచంద్ తో చేసిన 'గౌతమ్ నంద' ఆమె అభిమానులకు నిరాశనే కలిగించాయి.

ఆ తరువాత కూడా తమిళ సినిమాలనే చేస్తూ వెళుతోన్న ఆమె , తాజాగా ఒక తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. నితిన్ హీరోగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చేయడానికి దర్శకుడు వెంకీ కుడుముల సన్నాహాలు చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా హన్సికను ఎంపిక చేశారట. గతంలో నితిన్ జోడీగా ఆమె 'సీతారాముల కల్యాణం లంకలో' అనే సినిమా చేసిందనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్లోని కొత్త ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.    

More Telugu News