kashmir: ఎన్ కౌంటర్లో ‘లష్కరే’ కమాండర్ హతం

  • దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో ఘటన
  • గస్తీ బృందంపై ఉగ్ర దాడితో ఎదురుదాడికి దిగిన భద్రతా దళాలు
  • ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

దక్షిణ కశ్మీర్ లోని కుల్గాంలో ఈరోజు మధ్యాహ్నం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చద్దర్ ప్రాంతంలో గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చి చంపాయి.

మృతుల్లో ఒకరు లష్కరే తోయిబా కమాండర్ షకూర్ ఉన్నట్టు గుర్తించారు. మరో ఉగ్రవాది భద్రతా దళాలకు లొంగిపోయాడు. అతని నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో కుల్గాం జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. కాగా, 2015 నుంచి కశ్మీర్ ప్రాంతంలో షకూర్ చురుగ్గా పని చేస్తున్నాడు. షకూర్ మృతితో ‘లష్కరే’ కు భారీ ఎదురుదెబ్బతగిలినట్టు సమాచారం.

ఉత్తర కశ్మీర్ తో పోలిస్తే దక్షిణ కశ్మీర్ లోనే ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ చెప్పారు. ఈ ప్రాంతంలో మొత్తం 250 నుంచి 275 మంది ఉగ్రవాదులు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

More Telugu News