kajol: జిలేబి అంటే కాజల్ కి ఎంత ఇష్టమో చూడండి!

  • ఓ స్వీట్ షాపుకి వెళ్లిన కాజల్ అగర్వాల్
  • జిలేబి మొత్తాన్ని తినేస్తాననేలా నోరు తెరిచిన కాజల్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫొటో

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ ఆసక్తికర ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ స్వీట్ షాపులోకి వెళ్లిన కాజల్, అక్కడ ఉన్న జిలేబి చూసి నోరు తెరిచింది. ఆ జిలేబి అంతా తినేస్తానంటున్నట్టుగా నోరు తెరిచిన కాజల్ ఫొటోను అక్కడున్న వాళ్లెవరో తీశారు. ఈ ఫొటోను కాజల్ తన ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో కాజల్ నటిస్తోంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

More Telugu News