facebook: ప్రమాదాలను ముందే పసిగట్టేందుకు ఇంటెలిజెన్స్ బృందాన్ని నియమించుకున్న ఫేస్ బుక్

  • మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, మీడియా బయర్లకు చోటు
  • ఫేస్ బుక్ అన్ని రకాల కంటెంట్ పై నిఘా
  • సమస్యాత్మక ప్రవర్తనను ముందే పసిగట్టనున్న బృందం

ఇటీవల వరుస వైఫల్యాలతో విమర్శల పాలైన ఫేస్ బుక్ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లతో, మీడియా బయర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆపరేషన్స్ టీమ్ గా దీన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రకటనల విధానం, పేజీలు, ఇన్ స్టా గ్రామ్, మెస్సేంజర్, బజ్ ఫీడ్ న్యూస్ వీటన్నింటినీ ఈ బృందం సమగ్రంగా పరిశీలిస్తుంది.

కీవర్డ్ లు, ఇతర సంకేతాల ఆధారంగా, హింసను ప్రేరేపించే సమస్యాత్మక ప్రవర్తనను ముందే గుర్తించే విధంగా ఇది పనిచేస్తుంది. దాంతో సమస్యగా మారకముందే నివారించొచ్చని ఫేస్ బుక్ భావిస్తున్నట్టుంది. గూగుల్ కూడా యూ ట్యూబ్ లో వివాదాస్పద కంటెంట్ ను గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ డెస్క్ ను ఏర్పాటు చేసుకుంది. ఫేస్ బుక్ ఇటీవల డేటా చౌర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

More Telugu News