Hugs: 'కౌగిలింతల అమ్మాయి'ని హెచ్చరికలతో వదిలేసిన ముస్లిం మతపెద్దలు!

  • రంజాన్ నాడు ఆలింగనాలు ఇచ్చిన యువతి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
  • అమాయకత్వంతోనే కౌగిలింతలు
  • మొరాదాబాద్ ఇమామ్ మౌలానా ముఫ్తీ

ఇటీవలి రంజాన్ పర్వదినం నాడు, అబ్బాయిలకు వరుసగా కౌగిలింతలు ఇచ్చి వార్తల్లో నిలిచిన యువతిని ముస్లిం మతపెద్దలు మందలించి వదిలేశారు. ఆ యువతి కౌగిలింతల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొరాదాబాద్ జిల్లా ఇమామ్ గా ఉన్న మౌలానా ముఫ్తీ మొహమ్మద్ ఈ విషయమై స్పందిస్తూ, ఆమెతో తాను మాట్లాడానని, ఆమె అమాయకత్వంతోనే ఈ పని చేసిందని నమ్ముతున్నామని అన్నారు.

ఆమె చేసిన పనికి అసహనాన్ని వ్యక్తం చేసిన మౌలానా, ఇస్లాం ఇటువంటి ఘటనలను ఎన్నడూ అంగీకరిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అమ్మాయికి చెప్పి, ఇంకోసారి ఇటువంటి తప్పు చేయవద్దని హెచ్చరించినట్టు తెలిపారు. ఆమె కౌగిలింతలను తీసుకున్న యువకులపైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, వారంతా షరియత్ చట్టాలను అతిక్రమించినట్టేనని, మరోసారి ఇలా చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాగా, 16వ తేదీన మొరాదాబాద్ లో దాదాపు అరగంట పాటు ఆ యువతి, వరుసగా ఆలింగనాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమ్మాయి కౌగిలింత కోసం అబ్బాయిలు క్యూ కట్టారు కూడా.

More Telugu News