cow protection: రాజస్థాన్ లో మద్యం బాబులపై గో సంరక్షణ పన్ను

  • అన్ని రకాల మద్యం పన్నుపై 20 శాతం సెస్సు
  • నిన్నటి నుంచి అమల్లోకి
  • గో సంరక్షణ పేరిట ఇటీవలే స్టాంప్ డ్యూటీ సైతం పెంపు

ఆవుల సంరక్షణ కోసం రాజస్థాన్ లోని వసుంధరరాజే సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. మద్యంపై 20 శాతం సెస్సు విధించింది. జూలై 23 నుంచి రాజస్థాన్ వ్యాట్ చట్టం 2003 కింద అన్ని రకాల మద్యం విక్రయాలపై వసూలు చేస్తున్న పన్ను మీద 20 శాతం సర్ చార్జీ అమల్లోకి  వస్తుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

గో సంరక్షణ పేరిట రాజస్థాన్ సర్కారు తీసుకున్న రెండో నిర్ణయం ఇది. స్టాంప్ డ్యూటీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇది కూడా గోవుల సంరక్షణ కోసమే. కరువు ప్రభావిత ప్రాంతాల్లోని 1,682 ఆవుల సంరక్షణ కేంద్రాలు ఆరు లక్షల పశువుల మేత విషయంలో సమస్య ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్ లో మొత్తం 2,562 గో సంరక్షణ కేంద్రాల్లో సుమారు 8.6 లక్షల ఆవులు ఉన్నాయి.

More Telugu News