USA: సరదాగా జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటేసిన యువతి!

  • కెనడా నుంచి అమెరికాకు వెళ్లిన యువతి
  • అదుపులోకి తీసుకున్న బార్డర్ అధికారులు
  • రెండు వారాల నిర్బంధం

సరదాగా జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన ఓ యువతి అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించి, అక్కడి సరిహద్దు భద్రతా దళాలకు పట్టుబడి ఇబ్బందులు కొని తెచ్చుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే 19 సంవత్సరాల సిడెల్లా రోమన్ అనే యువతి, మే 21న నదీ తీరంలో జాగింగ్ చేస్తూ బయలుదేరింది. ఫ్రాన్స్ జాతీయురాలు అయిన ఆమె, తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు కెనడా వచ్చింది. జాగింగ్ చేసుకుంటూ, పచ్చటి అందాలను చూస్తూ మైమరచి పోయి చూస్తూ, సరిహద్దులు దాటి మూడు మైళ్లు వెళ్లిపోయింది. అలా వెళ్లి వెళ్లి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులకు పట్టుబడింది.

తాను పొరపాటున సరిహద్దులు దాటానన్నా, అధికారులు వినిపించు కోలేదు. సరిహద్దులు సూచించేలా బోర్డులు కనిపించలేదని చెప్పినా ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రోమన్ దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో ఆ ప్రాంతానికి 140 మైళ్ల దూరంలోని టకోమా నార్త్ వెస్ట్ డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. ఆక్కడ రెండు వారాల పాటు నిర్బంధించి, రోమన్ వివరాలన్నీ తెలుసుకుని విడిచిపెట్టారు. ఆమె కెనడా పౌరురాలు కాదని, ఫ్రాన్స్ యువతి కావడంతోనే విడిచిపెట్టడం ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు.

More Telugu News