Harshita: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగు సినిమాలో హిందీ సీరియల్ భామ 
  • రజనీకాంత్ కి బాలూ ఇంట్రో సాంగ్ 
  • ఎన్టీఆర్ కి తండ్రిగా నాగబాబు 
  • 'రణ్ భూమి'లో కీలక పాత్రలో రానా  


*  హిందీ సీరియల్ 'సద్దా హఖ్' ద్వారా పేరు తెచ్చుకున్న హర్షిత గౌర్ టాలీవుడ్ ప్రవేశం చేస్తోంది. మలయాళ చిత్రం 'అంగమలై డైరీస్' తెలుగు రీమేక్ లో హర్షిత కథానాయికగా నటిస్తోంది. విశ్వక్ సేన్ ఇందులో హీరోగా నటిస్తూ, దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఎప్సీ బాలసుబ్రహ్మణ్యం చేత ఇంట్రడక్షన్ సాంగ్ పాడించడం అన్నది ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా వస్తోంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలలో అది మిస్సయింది. ఈ నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ఇంట్రో సాంగును తాజాగా బాలూ చేత పాడిస్తున్నారట. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.    
*  ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరవింద సమేత..' చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. ఇందులో ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు తాజా సమాచారం. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.
*  బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా కరణ్ జొహార్ దర్శకత్వంలో 'రణ్ భూమి' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్ నటుడు రానా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

More Telugu News