Viral Videos: పొలం కోసం.. తల్లిని ప్రమాదంలోకి నెట్టిన తనయుడు.. వీడియో వైరల్

  • కోర్టు గొడవల్లో భూమిని కోల్పోయిన వ్యక్తి
  • ఆ పొలాన్ని దున్నేందుకు సిద్ధమైన ప్రత్యర్థులు
  • ట్రాక్టర్‌ కిందకు తల్లిని విసిరేసిన వ్యక్తి

తాను పొలం కోల్పోకుండా ఉండేందుకు తన తల్లి ప్రాణాలు కోల్పోయినా ఫర్వాలేదనుకున్నాడు ఓ వ్యక్తి. ఏ కుమారుడూ తన తల్లి పట్ల ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాడు. కోర్టు గొడవల్లో ఇటీవల ఆ వ్యక్తి భూమిని కోల్పోయాడు. తన ప్రత్యర్థులు ఆ పొలాన్ని దున్నేందుకు సిద్ధం కావడంతో.. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు వచ్చిన ఆ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని పొలం దున్నేందుకు ఉపయోగిస్తోన్న ట్రాక్టర్‌ కిందకు నెట్టాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ వృద్ధురాలికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది.                                                                                                             

More Telugu News