fifa: తాను ముద్దు పెట్టిన మహిళా జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన వ్యక్తి

  • ఫిఫా వరల్డ్ కప్ లైవ్ సమయంలో ముద్దు
  • వైరల్ అయిన వీడియో
  • తనంతట తాను క్షమాపణలు చెప్పిన వ్యక్తి

రష్యాలో ఫిపా వరల్డ్ కప్ సందర్భంగా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న కొలంబియాకు చెందిన మహిళా జర్నలిస్టు (జర్మన్ ఛానల్ లో పని చేస్తోంది)ను ఓ వ్యక్తి ముద్దుపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. లైవ్ తర్వాత చూస్తే, అతను కనిపించలేదని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ క్రమంలో ముద్దు పెట్టిన వ్యక్తి తనకు తానుగా బయటకు వచ్చాడు. తాను రష్యాకు చెందిన ఓ ఫుట్ బాల్ ప్రేమికుడినని చెప్పాడు. చేసిన పనికి తాను క్షమాపణలు వేడుకుంటున్నానని తెలిపాడు. టీవీ రిపోర్టర్ బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలంటూ తన స్నేహితుడు తనతో పందెం కాశాడని... అందుకే తాను ఆ పని చేశానని చెప్పాడు.

More Telugu News