air india: సర్వర్ ఫెయిల్ కావడంతో.. ఆగిపోయిన ఎయిరిండియా విమానాలు

  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానాలు
  • దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు
  • నడవడానికి కూడా స్థలం లేకుండా కిక్కిరిసిన ఎయిర్ పోర్ట్

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన పలు విమానాలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి. సంస్థకు చెందిన సర్వర్ ఫెయిల్ కావడమే దీనికి కారణం. విమానాలన్నీ నిలిచిపోవడంతో, ప్రయాణికులు తమ ట్విట్టర్ కు పని కల్పించారు.

 బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ చీఫ్ ఎక్జిక్యూటివ్ అఖిలేష్ మిశ్రా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఇప్పుడే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని... గత రెండు గంటలుగా ఎయిరిండియా విమానాలు నిలిచిపోయాయనే విషయం తెలిసిందని చెప్పారు. డొమెస్టిక్, అంతర్జాతీయ విమానాలన్నీ ఆగిపోయాయని తెలిపారు. ఏం చేయాలో పాలుపోని ప్రయాణికులతో విమానాశ్రయమంతా ఓ సంత మాదిరి కనిపిస్తోందని చెప్పారు. విమానాశ్రయంలో కనీసం నడవడానికి కూడా స్థలం లేకుండా ఉందని అన్నారు.

More Telugu News