Hyderabad: హైదరాబాద్‌లో వర్షం .. వాన నీట మునిగిన కారు.. ఊపిరాడక ఒకరి మృతి

  • కూకట్‌పల్లిలో పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు 
  • జయనగర్‌ కాలనీలో విషాదం
  • గత రాత్రి కారులో నిద్రించిన వ్యక్తి

హైదరాబాద్‌లో గత అర్ధరాత్రి నుంచి జోరు వాన కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర శివారులోని కూకట్‌పల్లిలో పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరాయి. అక్కడి జయనగర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరడంతో పార్క్‌ చేసి ఉన్న కారు నీట మునిగింది. దీంతో అందులో నిద్రిస్తోన్న ఓ వ్యక్తి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కూకట్‌పల్లిలోని పలు చోట్ల చిన్నపాటి వర్షం వచ్చినా అపార్ట్‌మెంట్‌లోకి నీరు వచ్చి చేరుతోందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News