Donald Trump: అమెరికాకు ఉత్తరకొరియాతో ఇప్పటికీ ముప్పే: ట్రంప్ సంచలన ప్రకటన

  • ఉత్తరకొరియాపై ఆర్థిక ఆంక్షలు మరో ఏడాది పొడిగింపు
  • ఆ దేశానికి సంబంధించి జాతీయ అత్యయిక స్థితి
  • ఆదేశాలపై ట్రంప్ సంతకాలు

ఉత్తరకొరియా నుంచి అమెరికాకు ఇప్పటికీ అసాధారణ ముప్పు పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇటీవలే సింగపూర్ లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం వారు ఇరువురు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో ఉత్తరకొరియా పూర్తి అణు నిరాయుధీకరణకు అంగీకరించింది. దీంతో ప్రపంచానికి ఓ పెద్ద ముప్పు తప్పిపోయిందని, ఇకపై ఉత్తరకొరియా నుంచి ఎంత మాత్రం అణు ముప్పు లేదని, అమెరికా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని ట్రంప్ లోగడ అన్నారు. అయితే, తాజాగా ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరకొరియాకు సంబంధించి జాతీయ అత్యయిక స్థితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ, ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరోసారి ఆమోదిస్తూ ట్రంప్ సంతకం చేశారు.

More Telugu News