water: గ్రామానికి నీటి కోసం కిలోమీటరు మేర కొండను తొలిచిన అపర భగీరథుడు

  • ఒడిశాలోని బన్స్ పాల్ తాలూకాలో నీటి సమస్య పరిష్కారం
  • కుటుంబ సభ్యులతో కలసి కిలోమీటరు మేర కాలువ తవ్వకం
  • 70 ఏళ్ల వృద్ధుడి ఆదర్శ శ్రమదానం

‘ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడపరా ముందుకు...’ ఇది ఒడిశాలోని కియోంజర్ జిల్లా బన్స్ పాల్ తాలూకా బైతరణి గ్రామానికి చెందిన దైతరినాయక్ (70)కు సరిపోతుంది. ఇతడు గ్రామం కోసం తన శక్తిని ధారపోసిన భగీరథుడు. గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండడంతో, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం కనిపించలేదు.

దాంతో ఎవర్నో ప్రాధేయపడడం కంటే తానే రంగంలోకి దిగితే ఫలితం ఉంటుందనుకున్నాడేమో... కరటకట నల్లా నుంచి తన గ్రామానికి నీటిని తేవడానికి శ్రమటోడ్చాడు . కొండ రాళ్లను బద్దలు కొట్టి.. చెట్లను పొదలను శుభ్రం చేసి.. కిలోమీటరు మేర కాలువ తవ్వి నీటి ప్రవాహానికి అనువుగా మార్చాడు. తన కుటుంబ సభ్యుల సహకారంతో దైతరినాయక్ ఈ క్రతువు పూర్తి చేశాడు. ఎక్కువగా కొండలు, అటవీ ప్రాంతంతో కూడిన బన్స్ పాల్, హరించందన్ పూర్, తెల్కాయ్ తాలూకాల్లో చాలా గ్రామాలకు తీవ్ర నీటి సమస్య ఉంది. తాగునీటికే నానా కష్టాలు పడే చోట పంటలు పండించేందుకు దైతరణి నాయక్ ఒక మార్గం చూపించి, గ్రామ ప్రజల్లో వెలుగులు నింపాడు.  

More Telugu News