Harish Rao: తెలంగాణ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు!

  • సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఘటన
  • హరీష్ ను అడ్డుకున్న రైతులు, కాంగ్రెస్ నేతలు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఆయన కాన్వాయ్ ను రైతులు, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కు భూమి పూజ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

చందుర్తి మండలానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ మంత్రి కాన్వాయ్ ను రైతులు ఆపేశారు. ఫ్లెక్సీలతో రోడ్డుపైకి వచ్చి, హరీష్ రావును అడ్డుకున్నారు. సాగు, తాగునీరును అందించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం హరీష్ రావు కాన్వాయ్ ను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ, తమను పట్టించుకోకుండానే మంత్రి వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News