niharika: దూకుడు పెంచిన నిహారిక .. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

  • నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్'
  • నెక్స్ట్ మూవీ దర్శకురాలిగా సుజన 
  • ఆ తరువాత రాహుల్ విజయ్ జోడీగా

బుల్లితెరపై తెలుగింటి అమ్మాయిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నిహారిక, తెలుగు తెరపై కథానాయికగా రాణించడానికి తనవంతు కృషి చేస్తోంది. 'ఒక మనసు' సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన నిహారిక, ఆ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకుంది. ఆమె కథానాయికగా నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో .. సుమంత్ అశ్విన్ జోడీగా ఆమె నటించింది.

ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే నిహారిక మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. సుజన దర్శకత్వం వహించనున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో శ్రియతో కలిసి నిహారిక చేయనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే తాజాగా మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేసింది. నిర్వాణ సినిమాస్ వారు తమ తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రణీత దర్శకురాలిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో కథానాయకుడిగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.   

More Telugu News