15 నిమిషాల పాటు లిఫ్ట్ లోనే చిక్కుకుపోయిన టీడీపీ నేతలు

23-06-2018 Sat 10:43
  • విజయవాడలోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో ఘటన
  • కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న చల్లా
  • కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఘటన
టీడీపీ నేతలు బుద్ధా రాజశేఖర్ రెడ్డి, మీనాక్షినాయుడులు లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. 15 నిమిషాల పాటు లిఫ్ట్ లోనే ఉండిపోయారు. ఈ ఘటన విజయవాడలోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కర్రలు, రాడ్లతో లిఫ్ట్ తలుపులు తెరిచి, వారిద్దరినీ క్షేమంగా బయటకు తీశారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా చల్లా రామకృష్ణారెడ్డి ఈ రోజు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన సంభవించింది.