Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మెగా హీరోతో రకుల్ స్పెషల్ సాంగ్
  • వెంకటేశ్, రానా కాంబోలో సినిమా ఉందట!
  • రత్నం కథ ఓకే చేసిన బాలకృష్ణ    

*  రామ్ చరణ్ తో కలసి అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడనుంది. చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో ఓ స్పెషల్ సాంగు వుంది. ఇందు కోసం రకుల్ ని తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ పాటలో నటించడానికి రకుల్ కి భారీ మొత్తం ముడుతున్నట్టు చెబుతున్నారు.
* వెంకటేశ్, రానా కలసి ఓ మల్టీ స్టారర్ చేయనున్నట్టు గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో రానా తండ్రి సురేశ్ బాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లోనూ ఓ చిత్రం తప్పకుండా ఉంటుందని, వచ్చే ఏడాది అది సెట్స్ కి వెళ్లచ్చని చెప్పారు.
*  ప్రముఖ రచయిత ఎం.రత్నం తాజాగా నందమూరి బాలకృష్ణకి ఓ కథ వినిపించినట్టు, అది బాలయ్యకు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే చిత్రానికి ఈ కథను బాలయ్య రికమెండ్ చేసినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తారు.    

More Telugu News